Grandhi Srinivas: వైసీపీకి భీమవరం మాజీ ఎమ్మెల్యే రాజీనామా..! 10 d ago
వైసిపికి పార్టీకి కీలక నేతలు రాజీనామా చేస్తున్నారు. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన కాసేపటికి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గుడ్ బాయ్ చెప్పారు. గ్రంధి శ్రీనివాస్ 2019 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పై గెలిచి రాష్ట్రమంతటా మంచి పేరు తెచ్చుకున్నారు. గత కొంతకాలంగా వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఆయన గురువారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.